సినిమా ఇండస్ట్రీకి మరో షాక్. ఎన్నో ఏళ్లుగా టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగిన రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు అయన పార్థివ దేహాన్ని చూసి సంతాపం తెలియజేసారు. ఇక రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున ఏడవడం ఇప్పుడు అందరిని బాధిస్తుంది.
మరణం ఎప్పుడు ఏ రూపంలో సంభవిస్తుందో ఊహించడం అసంభవం. ప్రస్తుత కాలంలో ఇలాంటి అకస్మాత్తు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మరణ వార్తలు ఎక్కువగా వినిపించడం విచారకరం. తాజాగా ప్రముఖ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసారు. హనుమాన్ షూటింగ్ క్లైమాక్స్ సీన్ లో పాల్గొన్నప్పుడు కూడా ఆయనకు రక్తపు విరేచనాలు కావడంతో తీవ్ర అస్వస్థకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు. ఇక రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున ఏడవడం ఇప్పుడు అందరిని బాధిస్తుంది.
సినిమా ఇండస్ట్రీకి మరో షాక్. ఎన్నో ఏళ్లుగా టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగిన రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు అయన పార్థివ దేహాన్ని చూసి సంతాపం తెలియజేసారు. ఇక కుటుంబ సభ్యులు రాకేష్ మాస్టర్ మరణాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. రాకేష్ మాస్టర్ కి ఇద్దరు పిల్లలు. కొడుకు చరణ్ తో పాటుగా ఒక కూతురు కూడా ఉంది. తండ్రి అంత్యక్రియలు మోస్తూ బోరున కొడుకు విలపిస్తుంటే.. కూతురు కూడా తమ నాన్న లేడనే నిజాన్ని నమ్మలేక కన్నీరు మున్నీరవుతుంది. వీరి బాధను చూస్తున్న అక్కడి ప్రజల వీరిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మాస్టార్ ఇప్పటి వరకు దాదాపు 1500 సినిమాలకు గాను కొరియోగ్రాఫీ చేసినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఎంతో మంది సినిమా హీరోలకు డ్యాన్స్ నేర్పడంతో పాటు కొంతమంది డ్యాన్స్ మాస్టర్లకు కూడా శిక్షణ ఇచ్చారు రాకేష్ మాస్టర్.