గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమా నుంచి ఈ భామ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లోని అందరు బిగ్ స్టార్స్ లో ఇలియానా నటించింది. ఇప్పుడు ఎంత పెద్ద స్టారో అందరికీ తెలిసిందే. కానీ, ఆమె మొదటి సినిమా దేవదాసులో ఘోర అవమానం ఎదుర్కొందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ గలీజ్ సీన్స్! అషు- అఖిల్ మధ్య..!
సుమన్ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్ మాస్టర్ దేవదాసు సినిమాకి సాంగ్స్ కొరియోగ్రఫీ చేసినప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. దేవదాసు సినిమా రామ్- ఇలియానా డెబ్యూ చిత్రం. హీరో, హీరోయిన్ ఇద్దరికీ ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు వచ్చింది. ‘దేవదాసు సినిమాలోని మాయదారి సిన్నోడు సాంగ్ సమయంలో ఇలియానా స్టెప్స్ సరిగ్గా వేయలేదని తారా మాస్టర్ కోపంతో చెంపదెబ్బ కొట్టేశారు. ఇలియానా అలిగి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. అసలు ఎవరు నీకు డాన్స్ నేర్పింది అని కేకలేశారు. నేను వెళ్లి తారా మాస్టర్ కు వివరంగా చెప్పి.. పది నిమిషాల్లో మళ్లీ డాన్స్ చేయిస్తే అందరూ చప్పట్లు కొట్టారు’ అంటూ రాకేశ్ మాస్టర్ అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.