తెలుగునాట వెండితెర జంటలు చాలానే ఉన్నాయి. కానీ .., బుల్లితెరపై స్టార్ పెయిర్ అంటే ముందుగా గుర్తుకి వచ్చేది రాజీవ్ సుమ జంట. ఇప్పటికీ తెలుగు టెలివిజన్ లో స్టార్ మహిళగా దూసుకుపోతోంది సుమ. ఇక.. రాజీవ్ కూడా మంచి నటుడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటించగల సత్తా అతని సొంతం. ఇక రీల్ లైఫ్ లో మాత్రమే కాదు.., రియల్ లైఫ్ లో కూడా వీరి జర్నీ ప్రశాంతంగా సాగుతూ వస్తోంది.
అయితే.., అప్పట్లో రాజీవ్.. సుమ గొడవలు పడ్డారని, ఇద్దరు విడిపోయారని వార్తలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్తలను ప్రసారం చేశారు. ఇందుకు తగ్గట్టే రాజీవ్ అప్పట్లో సుమ దగ్గర నుండి వేరే ఇంటికి వచ్చేయడంతో ఈ వార్తలకి బలం చేకూరింది. ఈ మొత్తం గొడవలకి ఆర్ధిక పరమైన విషయాలే కారణమని కామెంట్స్ వినిపించాయి. అయితే.., తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు.
నారప్ప మూవీ సక్సెస్ లో రాజీవ్ కనకాలది కీ రోల్. బసవయ్య పాత్రకి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తన వ్యక్తిగత విషయాలపై మొదటిసారి నోరు విప్పాడు. “మీరంతా అనుకుంటున్నట్టు నాకు, సుమకి మంచి గొడవలు లేవు. ఆ సమయంలో మా అమ్మ చనిపోయి.., నాన్న ఒక్కరే ఉన్నారు.
ఆయనకి ఒక్కరే ఎందుకు ఉండటమని.. నేను, నాన్న వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాము. పిల్లలు, సుమ వేరే ఫ్లాట్ లో ఉండిపోయారు. నేను డైలీ అక్కడికి, ఇక్కడికి మారుతూ ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకున్నాను. కానీ.., ఆ సమయంలోనే అంతా మేము విడిపోయినట్టు వార్తలు రాసేశారు” అంటూ రాజీవ్ చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో తమ తమ సంపాదనల విషయంలో కూడా రాజీవ్ స్పందించాడు. మా మధ్య ఆర్ధిక విషయాలకి సంబంధించి ఎలాంటి గొడవలు లేవు. రావు కూడా. నిజమే ఇప్పుడు తాను నాకన్నా ఎక్కువ సంపాదిస్తోంది. కానీ.., తాను బిజీ కాకముందు నేను కూడబెట్టిన ఆస్తులు కూడా ఉన్నాయి కదా? కుటుంబం అన్నాక కలసి సాగించే ప్రయాణం.
మా మధ్య ఇలా ఎవరు ఎక్కువ అన్న పోలిక రాదంటూ రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో నిలవడం విశేషం. మరి.. రాజీవ్ సుమ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.