సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులనే కాకుండా అందర్నీ అయస్కాంతంలా ఆకర్షిస్తుంటాడు. ఆయన భారత చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో కలిసి ఉన్నాడు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో దిగిన ఫొటోలు ఇవి. అమెరికాలోని మేయో క్లినిక్‌కు జనరల్ చెకప్ కోసం రజనీ వెళ్లాడు. 2016లో ఇక్కడే అతడు కిడ్నీ మార్పిడి చేసుకున్నాడు. అప్పటి నుంచి యూఎస్‌కు రజనీ రెగ్యులర్‌గా వెళ్తున్నాడు.
జూన్ 19న భార్య లతతో కలిసి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఈ సూపర్‌స్టార్ దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లాడు. ఇప్పటికే కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్, వాళ్ల పిల్లలు కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉంటున్నారు. అందరితో కలిసి ఈ మధ్య రజనీ వెస్ట్ వర్జీనియాకు వెళ్లాడు. అక్కడ ఉన్న కొంతమంది అభిమానులతో అతడు మాట్లాడాడు. వాళ్లతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రజనీ ఆరోగ్యం గురించి రచయిత వైరముత్తు వెల్లడించాడు. అతని ఆరోగ్యం బాగానే ఉన్నదని, త్వరలోనే ఇండియాకు తిరిగి వస్తాడని చెప్పాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరం లేదంటున్నారు.