రజనీకాంత్ అనే ఒక్క పేరు చాలు తమిళ చిత్ర పరిశ్రమ బాక్స్ ఆఫీస్ తో పాటు ప్రపంచ సినిమా బాక్స్ ఆఫీస్ బద్ధలైపోవడానికి. తాజాగా విడుదలైన జైలర్ మూవీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది.
రజనీకాంత్ అనే ఒక్క పేరు చాలు తమిళ చిత్ర పరిశ్రమ బాక్స్ ఆఫీస్ తో పాటు ప్రపంచ సినిమా బాక్స్ ఆఫీస్ బద్ధలైపోవడానికి. తాజాగా విడుదలైన జైలర్ మూవీ ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే సరికొత్త రికార్డ్స్ ని సృష్టించే దిశగా జైలర్ మూవీ ముందుకు దూసుకెళ్లిపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజని అభిమానులు జైలర్ మూవీ సక్సెస్ విషయం లో సంబరాలు చేసుకుంటూ ఉంటే రజని మాత్రం హఠాత్తుగా చెన్నై నుంచి మాయం అయ్యి సోషల్ మీడియా లో ప్రత్యక్షమయ్యాడు.
నిన్న మొన్నటి దాక జైలర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ తో బిజీ బిజీ గా గడిపిన రజనీకాంత్ ఇప్పుడు సినిమా విజయవంతం అయిన సందర్భంగా జరిపే ఫంక్షన్స్ కి దూరంగా ఉంటాడని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియా లో రజిని ఫోటో లు చూసి రజని ఫాన్స్ తో పాటు అందరు షాక్ కి గురయ్యారు. ఆ ఫోటో లు సాధారణ ఫోటోలు కాదు. రజని హిమాలయాల్లో దిగిన ఫోటోలు. రజని కాంత్ ప్రతి సంవత్సరం హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్తుంటాడు.
ఇప్పుడు కూడా ఎప్పటి లాగానే రజని హిమాలయాలకు వెళ్లాడు. అక్కడకొచ్చిన కొంత మంది ఇంగ్లీష్ వాళ్ళతో కలిసి రజని దిగిన ఫొటోస్ ని చూసి రజని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా రజని కున్న ఆధ్యాత్మిక చింతన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. దేవుడి ఆజ్ఞ ప్రకారం జైలర్ సినిమా పూర్తి చేశాను, ఫలితంతో నాకు సంబంధం లేదు అనేలా రజని కాంత్ హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్లడం నిజంగ చాలా గ్రేట్ అని హిమాలయాలకి సంబంధించిన రజని కాంత్ ఫొటోలుని చూసిన వాళ్ళు అనుకుంటున్నారు.