సూపర్‌స్టార్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తె’మూవీ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అయితే నిన్న వినాయక చవితి సందర్భంగా ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగనుంది. ఇందులో రజనీకాంత్‌కు జోడీగా నయనతార సందడి చేయనున్నారు. కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ పోస్టర్‌లో రజనీ సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు. తాజాగా ఈ మూవి నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.
ఒక చేత్తో బైక్ ను నడుపుతూ మరో చేత్తో వేటకొడవలి పట్టుకుని దూసుకువచ్చే రజనీ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పోస్టర్ లో ఎంత సాంప్రదాయంగా కూల్ గా ఉన్నారో.. సెకండ్ పోస్టర్ లో అంత ఆవేశంతో కనిపిస్తున్నాడు రజినీకాంత్. ఈ మూవీలో ఇక బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.