టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది పేర్లు వినిపిస్తాయి. అయితే.. ఎక్కువ మంది హీరోలకి, నటులకి, కామన్ గా ఉండే ఒకే ఒక్క ఫ్రెండ్ జూనియర్ యన్టీఆర్. ఒక్కసారి మనిషిని నమ్మితే ప్రాణం ఇచ్చేసేంత స్నేహం చేస్తారు తారక్. ఇప్పటికే ఈ విషయం ప్రూవ్ అయ్యింది కూడా. అయితే.., జూనియర్ యన్టీఆర్ కి ఎంత మంది స్నేహితులు ఉన్నా, వారిలో రాజీవ్ కనకాల స్థానం మాత్రం ప్రత్యేకం. కెరీర్ స్టార్టింగ్ నుండి తారక్ కి రాజీవ్ మంచి స్నేహితుడిగా కొనసాగుతూ వస్తున్నాడు.
ఇక యన్టీఆర్ చాలా సినిమాల్లో రాజీవ్ కనకాలకి మంచి రోల్స్ దక్కుతుంటాయి. సెట్ లో వీరిద్దరూ ఉంటే ఆ అల్లరి మాములుగా ఉండదు. అయితే.., ఇంతటి ప్రాణ స్నేహితుల మధ్య కూడా గొడవ జరిగింది అంటే మీరు నమ్ముతారా ? అవును.. తారక్, రాజీవ్ మధ్య కొన్ని రోజులు కోల్డ్ వార్ నడించింది అంట. ఈ విషయాన్ని స్వయంగా రాజీవ్ కనకాల సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నారప్ప మూవీ సూపర్ సక్సెస్ లో రాజీవ్ కనకాలది కూడా చాలా కీలక పాత్ర. ఇక ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా సుమన్ టీవీకి ఇంటర్వూ ఇచ్చిన రాజీవ్.. ఆ ఇంటర్వ్యూ లోనే తారక్ తో తన అనుబంధాన్ని పంచుకున్నాడు. “మాది స్టూడెంట్ నెం-1 మూవీ నుండి కొనసాగుతూ వస్తున్న స్నేహం. ఆ సినిమా ఫస్ట్ రోజు షూట్ లో నేను స్పెట్స్ పెట్టుకుంటే.. యన్టీఆర్ అవసరమా నీకు అవి అంటూ కామెంట్ చేశాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఆ దెబ్బతో సినిమా నుండి సైతం తప్పుకుందాం అనుకున్నా. కానీ.., నన్ను రాజమౌళి ఆపాడు. అయితే.., తరువాత నుండి యన్టీఆర్ నేను క్లోజ్ అయిపోయాము. ఇక సెకండ్ షెడ్యూల్ టైమ్ కి ఆయన నన్ను రే.. రాజా అని పిలిచే అంత స్నేహం ఏర్పడింది. ఇక అప్పటి నుండి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామని రాజీవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఈ వీడియోపై లుక్ వేసేయండి.