సినీ ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టార్ హీరోతో సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. వాళ్ళ కెరీర్ లో అది సాధ్యపడవచ్చు.. పడకపోవచ్చు.. కానీ, ఏదొక సందర్భంలో తాము ఫలానా హీరోతో సినిమా చేయాలని ఉందంటూ వారి డ్రీమ్స్ ని బయట పెడుతుంటారు. అయితే.. బాక్సాఫీస్ వద్ద సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవుతాయి. అదే రజినీతో సినిమా తీసే అవకాశం ఏ దర్శకుడికైనా లభిస్తే మాత్రం వారి ఆనందానికి హద్దులు ఉండవు అనేది వాస్తవం.
సూపర్ స్టార్ రజినీ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంలేదు. ఎందుకంటే.. దాదాపు పలు దశాబ్దాలుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ సపరేట్ స్టైల్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన రజినీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సూపర్ స్టార్. రజినీని ప్రేమగా తలైవా అని కూడా పిలుస్తుంటారు అభిమానులు. అయితే.. తెరపై రజినీ సినిమాలు చూడటం వేరు.. రజినీతో సినిమా తీసి తెరపై ప్రెజెంట్ చేయడం వేరు. ఆయనతో సినిమా తీయాలని ఎంతోమంది దర్శకులు ఛాన్స్ కోసం చూస్తుంటారు.
ఈ క్రమంలో పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి.. సూపర్ స్టార్ రజిని సర్ తో సినిమా చేయాలని ఉందని చెప్పడం సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా పలు సందర్భాలలో రాజమౌళి రజినితో సినిమా చేయాలని ఉందని.. ఒకవేళ తాను ఆయనతో సినిమా చేస్తే.. థియేటర్లో కొద్దిరోజులపాటు ఈలలు, గోలలు సందడే ఉంటుందని చెప్పాడు. అయితే.. రాజమౌళి చెప్పడమైతే అయ్యింది. కానీ.. ఇంతవరకు వీరి కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు.
ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా రజినీతో సినిమా చేయాలనే కోరికను మరోసారి బయట పెట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి.. తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయనున్నాడు. ఇక మరోవైపు సూపర్ స్టార్ రజిని కూడా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియదు. కానీ.. వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు అభిమానులు. మరి సూపర్ స్టార్ తలైవా, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ పై అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Dir @ssrajamouli : I would love to direct a movie with #Superstar @rajinikanth
— Ramesh Bala (@rameshlaus) August 24, 2022