తెలుగు ఇండస్ట్రీలో అపజయాలు అంటే తెలియని అతి కొద్ది మంది డైరెక్టర్స్‌లో.. దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1తో ప్రారంభమైన ఆయన విజయ ప్రస్థానం అలా కొనసాగుతోనే ఉంది. మగధీర, యమదొంగ, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా.. మర్యాద రామన్న సినిమాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం అయినా సరే.. విజయం మాత్రం పక్కా.
ఇది కూడా చదవండి: RRR మూవీకి డైరెక్టర్ రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంత..?
ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో.. జక్కన్న తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర అంశం వెల్లడించారు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాల్లో.. తనకు నచ్చని సినిమా ఏదో తెలిపాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: రామ్ చరణ్- తారక్ పై రివేంజ్ తీర్చుకున్న రాజమౌళి
ఇంటర్వ్యూలో జక్కన్న పలు ఆసక్తికర అం శాల గురించి వెల్లడించారు. దానిలో భాగంగా.. తాను తొలిసారి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అంటే తనకు చాలా చిరాకని.. అప్పటికి తనకు అంత అవగాహన లేకపోవడం వల్ల.. ఆ సినిమా అలా తీశానని తెలిపాడు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. అనుకోని పరిస్థితుల్లో నేరస్థుడిగా మారిన ఓ యువకుడికి తిరిగి చదువుకునే అవకాశం లభిస్తే.. ఆ తర్వాత అతడి జీవితంలో ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా 2001 లో విడుదలైంది. అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక రాజమౌళి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి. జక్కన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రజనీకాంత్ హీరోగా, కమల్ విలన్ గా రాజమౌళి మూవీ!