దర్శకధీరుడు రాజమౌళి.. సినిమా ప్రేమికులు ముద్దుగా పిలుచుకునే పేరు జక్కన్న. సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కిస్తూ పాన్ ఇండియా లెవల్ లో రాజమౌళి పేరు ఓ ప్రత్యేకమనే చెప్పాలి. బాహుబలి మూవీతో ఆయన రేంజ్ ఇంకాస్త పెరిగింది. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఇక విషయంఏంటంటే..? ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళికి మీరు తమిళ హీరోలతో మల్టీస్టారర్ చిత్రం చేస్తే ఎవరితో చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది.
ఇది కూడా చదవండి: RRR చరిత్రలో నిలుస్తుంది.. 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన సెన్సార్ సభ్యుడు!దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ.. కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. ఒకవేళ రజిని కాంత్ విలన్‌గా కమల్ హాసన్ హీరోగా ఉన్నా పరవాలేదు. ఇది చాలా సార్లు నా మైండ్‌లో కదులుతుంది అంటూ జక్కన్న సమాధానం ఇచ్చాడు. మరి నిజంగానే రాజమౌళి ఐడియా సినిమా రూపంలో వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. తమిళ హీరోలతో మల్టీస్టారర్ చిత్రం తయాలనే రాజమౌళి ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.