తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మగధీర, బాహుబలి సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ రేంజ్ నా జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ కావడం మంచి రెస్పాండ్ రావడం జరిగింది. దీంతో ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 7న సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నారు. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉన్నారు ఆర్ఆర్ఆర్ టీమ్. దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవాలని భావించడం లేదు.
టాలీవుడ్ లో టాప్ హీరోలుగా చలామణి అవుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ‘ఆర్ఆర్ఆర్’ లో సముచితమైన స్థానం ఇచ్చినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ రాజమౌళికి చరణ్, ఎన్టీఆర్ లో పర్ఫెక్ట్ నటులు ఎవరనే ప్రశ్న ఎదురైన సందర్భంలో ఆయన తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ తనకు చాలా సంవత్సరాల నుంచి తెలుసని ఎన్టీఆర్ కు ఒక సీన్ చెబితే అప్పుడే ఆ సీన్ ను ఊహించుకుంటాడని చెప్పుకొచ్చారు. కథ అర్థం చేసుకొని ఆ సీన్లను ఎన్టీఆర్ తనలో తాను ఫీల్ అవుతాడని సెట్ లోకి వచ్చేసరికి నిమిషాల్లో కావాల్సింది ఇచ్చేస్తాడని రాజమౌళి అన్నారు.
ఇదీ చదవండి : హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి! మెగా రిక్వెస్ట్ తో ఒప్పుకున్న స్టార్ హీరో!
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఆయన ఓ వైట్ పేపర్ లాంటివాడని.. చరణ్ ను ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చని ఏది కావాలంటే అది ఇవ్వడంలో చరణ్ ముందుంటాడని జక్కన్న తెలిపారు. కొన్ని విషయాల్లో తారక్ గొప్ప అయితే మరికొన్ని విషయాల్లో రామ్ చరణ్ గొప్ప అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలిజేయండి.