దర్శకుడు రాజమౌళి.. భారీ బడ్జెట్‌తో, ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి.. అత్యద్భుతంగా తెరకెక్కించిన చిత్రం RRR. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్ల వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక సినిమాలోని నాటు నాటు సాంగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ సారి జూనియర్ ఎన్టీఆర్ నాటు నాటు పాట కోసం.. జక్కన్న తమతో.. 17 టేకులు చేయించారని.. కానీ రెండో టేక్‌లో చేసిన దాన్నే ఓకే చేశారని తెలిపారు. అదే సమయంలో RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగే సక్సెస్ పార్టీలో రాజమౌళి నాటు నాటు స్టెప్ వేయాలని జూనియర్ కోరారు. రాజమౌళి కూడా ఓకే అన్నారు.
ఇది కూడా చదవండి: రాజమౌళి గురించి చెబితే.. ఆయన ఎవరు? అని అడిగేవాళ్లు: రాహుల్ దేవ్
జూనియర్ అన్నట్లే RRR విడుదలై భారీ సక్సెస్ సాధించింది. పలు ప్రాంతాల్లో తిరుగులేని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో సినిమా భారీ విజయం నేపథ్యంలో RRR నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. త్రిబుల్ టీమ్ మొత్తానికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో తారక్‌కు చెప్పినట్లు.. RRR సక్సెస్ తర్వాత నాటు నాటు స్టెప్ వేస్తానన్న రాజమౌళి.. తమను ఇంటర్వ్యూ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి స్టేజ్‌పై నాటు నాటు స్టెప్‌కు డాన్స్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సింహాద్రి సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: Jr Ntr
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.