ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” మూవీలోని ఐటమ్ సాంగ్ పై వివాదం కంటిన్యూ అవుతోంది. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో సమంత నటించారు. “ఊ అంటావా.. ఊ ఊ అంటావా” పాట బాగా వైరల్ అయింది. కానీ..పాటలో అభ్యంతరకరపదాలు ఉన్నాయని.. వెంటనే వాటిని తొలగించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈ పాట మీద కేసులు కూడా పెట్టారు.
గతంలో “పుష్ప” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ ఈ ఐటెం సాంగ్ పై మాట్లాడారు. దేవి శ్రీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ సాంగ్సే అన్నారు. ఆయన వ్యాఖ్యలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఐటం సాంగ్.. దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు దేవి శ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.