యంగ్ హీరో రాజ్ తరణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం “సాండప్ రాహుల్”. సాంటో తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 18న రిలీజ్ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈక్రమంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ, హీరో రాజ్ తరుణ్ సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో ఒక్కటి వైరల్ గా మారింది. ఇందులో రాజ్ తరుణ్, వర్షను ఇంటర్య్వూ చేస్తూ ఉండా వర్ష వాటికి సమాధానలు చెప్పింది. ఈ క్రమంలో తన పెళ్లి, ప్రెగ్నెన్నీ పై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది వర్ష బొల్లమ్మ.
ఇంటర్య్వూల్లో భాగంగా వీరిద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ సాగుతుంది. వర్ష గురించిన పలు ఆసక్తికర విషయాలపై రాజ్ తరుణ్ ప్రశ్నించాడు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి ఎక్కువగా వార్తల్లో నిలిచిన, గూగుల్ సెర్చ్ చేసిన అంశాలపై రాజ్ తరుణ్, వర్షను ప్రశించాడు. అన్ని ప్రశ్నలకు వర్ష తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి, ప్రెగ్నెంట్ వార్తలపై వర్ష అసహనం వ్యక్తం చేసింది. నాకు పెళ్లైయితే ఏంటీ, కాకపోతే ఏంటీ. అది నా వ్యక్తిగత విషయం అంటూ కాస్తా ముక్కుమీదు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అయ్యింది, కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ చమత్కరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో పై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.