ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా విడాకుల వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ స్టార్స్ మొదలు.. స్టార్ కపుల్స్ వరకు చాలా మంది విడిపోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ఈ దంపతుల మధ్య ఆస్తి పంపకాలు కూడా పూర్తయ్యాట. ఇంతకు ఎవరా స్టార్ కపుల్ అనే విషయం తెలియాలంటే ఇది చదవండి.
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారట. ఇందుకు ప్రధాన కారణం రాజ్ కుంద్రా మీద వచ్చిన ఆరోపణలే. గతేడాది రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్‌పై బయటకు వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి వచ్చాక ఆయన ఎక్కడా మీడియాలో కనిపించలేదు. శిల్పా శెట్టి కూడా దీనిపై ఎక్కడా స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా రాజ్ కుంద్రా తన ఆస్తులను భార్య శిల్పాశెట్టికి బదలాయించాడు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : విడాకుల దిశగా మరో స్టార్ కపుల్..?
వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న శిల్పాశెట్టి స్టాంప్ డ్యూటీ కింద రూ.1.9 కోట్లు చెల్లించగా ఈ లావాదేవీల వివరాలను జప్‌కే డాట్ కామ్ వెల్లడించింది. ఇంత సడెన్ గా రాజ్ కుంద్రా తన పేరటి ఉన్న ఆస్తులను భార్య పేరు మీదకు మార్చడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే వీరు విడాకులు తీసుకుంటారని.. అందుకే ఇలా ఆస్తుల భార్య పేరు మీదరకు మార్చడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఇంత తక్కువ ఆస్తి శిల్పా పేరు మీద బదలాయించడం ఏంటి.. మిగతా ఆస్తులు ఏం అయ్యాయి అని నెటిజనులు చర్చించుకుంటున్నారు. మరి ఎలాంటి నిర్ణయం వెలువడనుందో చూడాలి.