ఫిల్మ్ డెస్క్- బిగ్ బాస్ రియాల్టీ షోతో చాలా మంది ఫేట్ మారిపోయింది. అంతవరకు సాదాసీదాగా ఉన్న వాళ్లకు బిగ్ బాస్ తో సెలబ్రెటీ హోదా వచ్చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ షో తరువాత బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ కి ముందు చాలా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ తెర వెనుకే ఉండిపోయాడు. అప్పుడు పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్3 సీజన్ విజేత కావడంతో రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాతంగా పెరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో సహ పార్టిసిపెంట్ పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్ బయటకు వచ్చాక ఏమైందో తెలియదు కానీ ఇద్దరు సైలెంట్ అయిపోయారు.
ఐతే ఇప్పుడు రాహూల్ అనూహ్యంగా అషురెడ్డితో లవ్ లో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అషూరెడ్డితో ఎక్కువగా కనిపిస్తూ, ఆమెతో ఫోటోలు పెడుతూ హల్ చల్ చేస్తున్నాడు. మొన్న అయితే ఏకంగా అషూ రెడ్డిని ఎత్తుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ మొదలైంది. అందుకు అనుగునంగా ఓ ఇంటర్వూలో .. పిలగా.. పిలగా.. భూలోకం మొత్తంలో నువ్వే నాకు తోడు.. నీ కోసం వచ్చేస్తా ఎందాకైనా చూడు.. అంటూ రాహూల్ కోసం పాట పాడింది అషు రెడ్డి. ఆ తర్వాత రాహుల్ ఆమెను దగ్గరకు తీసుకుని ఇంటర్వ్యూ మధ్యలో ప్రేమగా హత్తుకున్నాడు. నా కోసం అషు రెడ్డి.. పిలగా అని పాట పాడుతుంటే నా గుండె చప్పుడు పెరిగిపోయిందని రాహూల్ కామెంట్ కూడా చేశాడు.
ఇద్దరి మధ్య ఏముందని యాంకర్ ప్రశ్నించగా.. కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం.. హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాం.. అని రాహుల్ అదో టైపు సమాధానం చెప్పాడు. అంతే కాదు తనకు అషు రెడ్డి చాలా స్పెషల్ అని, ఆమె చూపించే కేరింగ్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. చూడడానికి ఒక బొమ్మలాగా ఉంటుంది కానీ ఆమె మనసు చాలా మంచిది అని అదో టైపులో కామెంట్ చేశాడు రాహూల్. ఇలా ఒకరిపై ఒకరు తెలియకుండానే ప్రేమ చూపుతున్నారా.. ఇద్దరి మధ్య ఏదో ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాహూల్, అషూ రెడ్డిలు ఎప్పుడు ఓపెన్ అవుతారోనని అంతా ఎదురుచూస్తున్నారు.