రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు.. చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం. బిగ్‌బాస్ హౌజ్‌లో తన సింప్లిసిటీ, ఒరిజనల్ క్యారెక్టర్‌తో బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విన్నర్‌గా నిలవడమే కాక ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ తర్వాత నుంచి వరుసగా పలు షోలలో పాల్గొంటూ.. ఆల్బమ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు రాహుల్ సిప్లిగంజ్. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటాడు. ఈ క్రమంలో తన అభిమానులకు శుభవార్త చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. కొత్త ఇంటి కలను సాకారం చేసుకున్నట్లు వెల్లడించాడు. గృహప్రవేశం వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. తన అభిమానుల వల్లే ఇది సాధ్యం అయ్యిందని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
రాహుల్ తన కొత్త ఇంట్లో దిగిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు రాహుల్. కొత్తింటి కల సాకారమైందని, గృహ ప్రవేశం కూడా పూర్తయిందని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పాడు. అభిమానుల మద్దతు, ప్రేమాభిమానాలు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదన్నాడు. తనపై ఇంతటి ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. రాహుల్ గృహప్రవేశం విషయం తెలిసిన వెంటనే బుల్లితెర సెలబ్రిటీలు విశ్వ, అషూ, శిల్ప, మెహబూబ్ దిల్‌సే, రోల్ రైడా, అరియానా గ్లోరీ తనకు శుభాకాంక్షలు తెలిపారు.