హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులు ఉండటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్ర సీమకు చెందిన నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా పోలీసులు విచారించి పంపారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. హోటల్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉండబట్టి పబ్‌కు వెళ్లాను. రాత్రి 1-2 గంటల మధ్య పోలీసులు దాడి చేశారు. నేను, నా కుటుంబ సభ్యులతో కలిసి పబ్‌కు వెళ్లాను. మేం బటయకు వెళ్దామని అడిగితే.. అధికారులు కుదరదన్నారు. సరే అని లోపలే ఉండిపోయాను. తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి.. వివరాలు తీసుకుని పంపించారు. డ్రగ్స్ లిస్ట్‌లో నా పేరు లేదు.. పబ్‌కు వెళ్లిన వారి లిస్ట్‌లో నా పేరు ఉంది. దాంతో నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. పోలీసులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తాను’’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: బంజారాహిల్స్‌లో భారీ రేవ్ పార్టీ.. పోలీస్ అదుపులో బిగ్ బాస్ విజేత?
‘‘ఇక పబ్ మేనేజర్ వాట్సాప్ గ్రూప్‌లో సినిమా వాళ్ల పేర్లు ఉన్నాయి అంటున్నారు. నాకు ఏ గ్రూప్ గురించి తెలియదు. నా మోబైల్ ఇస్తాను.. చెక్ చేసుకొండి. నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఇందులో ఎవరి పేర్లు నేను తీసుకురాను. ఇప్పటికే మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ బాధపడుతున్నారు. రైడ్ జరిగినప్పుడు నేను అక్కడ ఉండటం నా బ్యాడ్‌లక్. ప్రేక్షకులకు, అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే. నేను డ్రగ్స్ తీసుకోలేదు’’ అని రాహుల్ సిప్లిగంజ్ స్పష్టం చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో నిహారికకు నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.