టాలీవుడ్లో పాపులర్ సింగర్స్‌లో ఒకరు రాహుల్ సిప్లిగంజ్. ఈ సింగర్ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడుతూ ప్రేక్షకులను మెప్పించే రాహుల్ సిప్లిగంజ్.. ‘రంగమార్తాండ’ మూవీతో యాక్టింగ్ కెరీర్‌నూ మొదలుపెట్టారు. ఇందులో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. యూట్యూబ్ వీడియో సాంగ్స్‌తో మొదలైన ఈ ఓల్డ్ సిటీ కుర్రాడి సింగింగ్ కెరీర్.. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేదిక వరకు వెళ్లింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో ‘నాటు నాటు’ పాటతో యావత్ దేశ ప్రజలనే కాదు.. మొత్తం ప్రపంచాన్ని మెస్మరైజ్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్.
ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ పెర్ఫార్మెన్స్తో తన ఫాలోయింగ్‌ను గ్లోబల్ వైడ్‌గా పెంచుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. అలాంటి ఈ స్టార్ సింగర్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన సోదరుడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ సోదరుడి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. బీఆర్ఎస్ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తదితర నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.