మమ్మల్ని కలిపేందుకు ఆ హీరో చేయని ప్రయత్నం లేదు: రాహుల్, చిన్మయి

టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో ఒకరు రాహుల్ రవీంద్రన్, చిన్మయి. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కామ్ గోయింగ్.. మరొకరు ఫైర్ బ్రాండ్‌గా ఉండే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇన్నాళ్లు కలిసి ఉండటం పట్ల ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు వీరికి కవలలు పుట్టిన సంగతి విదితమే. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఇద్దరూ..

టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో ఒకరు రాహుల్ రవీంద్రన్, చిన్మయి. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడు నుండి దర్శకుడిగా, అలాగే ప్రత్యేకమైన క్యారెక్టరతో ముందుకు సాగుతున్నారు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. చిలసౌతో్ దర్శకుడిగా మారారు. చిలసౌ సినిమాకు గానూ బెస్ట్ ఒరిజనల్ స్ర్కీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును కూడా పొందారు. అలాగే సింగర్, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ,  హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడారు. డబ్బింగ్ అందించారు. అంతే కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా వ్యవరిస్తున్నారు. ఆడ పిల్లలపై లైంగికపరమైన దోపిడీని అడ్డుకునేందుకు ఏర్పడిన మీ టూ ఉద్యమాన్ని విసృత్తం చేశారు. సమాజంలో ఆడ పిల్లలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ.. మహిళల సమస్యలు, వాటి పరిష్కరాల గురించి పంచుకుంటారు. ఒక కామ్ గోయింగ్.. మరొకరు ఫైర్ బ్రాండ్‌గా ఉండే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇన్నాళ్లు కలిసి ఉండటం పట్ల ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు వీరికి కవలలు పుట్టిన సంగతి విదితమే.

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదట. ఓ హీరో తమను కలిపినట్లు చెప్పుకొచ్చారు ఈ ఇద్దరు. ఈ ఇద్దరు స్టార్ కమెడియన్, వారి కామన్ ఫ్రెండ్ వెన్నెల కిశోర్ ‘అలా మొదలైంది‘ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇధి ఎంతో ఫన్నీగా సాగిపోయింది. అందులో వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.. ‘ మంచితనానికి మాశ్చురైజర్ చేస్తే రాహుల్ అని, సత్యానికి శానిటైజ్ పెడితే చిన్మయి’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే వీరి లవ్ స్టోరీ గురించి అడిగి తెలుసుకున్నాడు. ‘డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరో క్యూట్‌గా ఉన్నాడు కదా అని అనిపించిందట. ఈ విషయం పెళ్లి తర్వాత చెప్పింది’ అని రాహుల్ అనే సరికి..‘అయ్యే ఈయన ఏదో వాగుతున్నాడు’ అంది చిన్నయి. అసలు తాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు. అయితే రాహుల్.. తనను కలవక ముందు వరకు తనదీ అదే నిర్ణయమని అన్నారు.

‘కళ్లల్లో కళ్లు పెట్టి ఒకటి చెప్పాను’ అని రాహుల్ అనగా.. ‘కళ్లల్లో కళ్లు పెట్టి ఏం చెప్పలేదు’ అని చెప్పి చిన్మయి ఆటపట్టించింది. ‘అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను మాత్రం ఎందుకంత దిగజారిపోవాలి అని ఫిక్స్ అయిపోయాను.. అరగంట తర్వాత ఏదో కొడతా ఉంది’ అని రాహుల్ చెప్పగా.. ‘మనం ఎన్నో సార్లు దిగజారిపోయాం కదరా’ అని వెన్నెల కిశోర్ సెటైర్ వేయగా.. మొత్తం ముగ్గురు నవ్వుకున్నారు. ఆ సమయంలో తమనున కలిపిన హీరో గురించి చెప్పారు. ‘ సందీప్ కిషన్ నువ్వు రాహుల్ని కలవాలి, అతడిని మీట్ అవ్వాలి’ అని అనగా.. రాహుల్ మాట్లాడుతూ.. తన కోసం మార్కెటింగ్ మొదలు పెట్టాడు అనగానే..‘మార్కెటింగ్ లో సందీప్ కిషన్ వేరే లెవల్ యాక్చువల్‌గా ’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు వెన్నెల కిశోర్. ఈ సందర్భంగా చాలా విషయాలు పంచుకున్నారు. ఈ ప్రోమో మొత్తం నవ్వులు పూయించింది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed