కమెడియన్‌గా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. కొన్ని రోజుల క్రితం సినిమాలు చేయనంటూ ప్రాంక్ చేసి ట్రోలింగ్‌కు గురయ్యాడు. అదలా ఉండగా.. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటోతో మరోసారి వార్తల్లో నిలిచాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు రాహుల్ రామకృష్ణ. అంతేకాక.. కాబోయే భార్యను కూడా పరిచయం చేశాడు.
ఇది కూడా చదండి: Rahul Ramakrishna: విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్ రామక్రిష్ణ
త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన రాహుల్ రామకృష్ణ.. తన జీవిత భాగస్వామి ఫోటోను కూడా షేర్ చేశాడు. ఎట్టకేలకు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలో రాహుల్ రామకృష్ణ, ఆయన కాబోయే భార్య ఇద్దరు ఉన్నారు. అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజనులు రాహుల్ రామకృష్ణకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన త్రిబుల్ ఆర్ చిత్రంలో రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Seethakka: ప్రకాష్ రాజ్‌కి ఎమ్మెల్యే సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్!