తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. టాలీవుడ్ లో ఉన్న కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరని అంటారు.. అయినా కూడా ఎవరూ ఎవరికి పోటీకాదు.. తమ కామెడీ టైమింగ్ తో మెప్పిస్తుంటారు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, ఆలీ తర్వాత వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సప్తగిరి, రాహూల్ రామకృష్ణ మరికొంతమంది కమెడియన్లు తమ కామెడీతో సత్తా చాటుతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తెలంగాణ యాసతో ఆకట్టుకున్న రాహూల్ రామకృష్ణ అతి కొద్ది కాలంలోనే స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించాడు. రాహూల్.. హరిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.. కాకపోతే తన పెళ్లి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాడు. సంక్రాంతికి తనకు కొడుకు పుట్టాడని తన సంతోషాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగిన వారిలో రాహూల్ రామకృష్ణ ఒకరు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత వరుస ఛాన్సులతో దూసుకుపోతున్నాడు రాహూల్. జాతి రత్నాలు మూవీలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే పలు వెబ్ సీరీస్ లో నటిస్తున్నాడు. గత ఏడాది హరిత అనే యువతిని పెళ్లి చేసుకున్న రాహూల్ రామకృష్ణ నవంబర్ లో తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి రోజు తనకు కొడుకు పుట్టాడని ట్విట్ చేశాడు. కాకపోతే తన కొడుకు ఫోటో రివీల్ చేయలేదు.
ఇన్నాళ్లకు తన కొడుకును ప్రపంచానికి పరిచయం చేశాడు రాహూల్ రామకృష్ణ. తన కొడుకు పేరు రూమీ అని పేరు పెట్టామని ట్విట్ షేర్ చేశాడు. ఇందులో హరిత.. రుమీని ఎత్తుకొని ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ స్టిల్ ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కంగ్రాట్స్ రాహూల్ అన్నా.. రుమీకి స్వాగతం అంటూ కొంతమంది.. జూనియర్ రాహుల్ రామకృష్ణ వచ్చేశాడు..అని కొంతమంది అంటే.. ఈ పేరు చాలా కొత్తగా ఉంది.. ఇంతకీ దాని అర్థం ఏంటీ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. రూమీ అంటే ఫేమస్ పర్సియన్ కవి.. అతడి పేరు తన కుమారుడికి పెట్టినట్లు రాహూల్ రామకృష్ణ పెట్టాడు. ప్రస్తుతం రాహూల్ రామకృష్ణ లీడ్ రోల్ లో ‘ఇంటింటి రామాయణం’ మూవీలో నటిస్తున్నాడు.
Meet Rumi along with his family 😘 pic.twitter.com/SJefvm2Gho
— Rahul Ramakrishna (@eyrahul) April 24, 2023