ఇప్పటి వరకు వెండితెరపై ఎన్నో యాదార్థ కథనాలతో చిత్రాలు తెరకెక్కాయి.. అందులో కొన్ని చిత్రాలు సామాన్యులనే కాదు.. సెలబ్రెటీల మనుసు కూడా కదిలించాయి. తాజాగా 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది.
ప్రముఖ దర్శకుడు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విమర్శకులచే ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సినిమా చూసి సూర్యకు లేఖ రాయడం విశేషం. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపించారు. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు.
ఈ సినిమా చూడటంతోనే నేను చలించి పోయాను. చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. అంతే కాదు పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా రాఘవ లారెన్స్ ఈ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, లిజోమోల్ జోస్, మణికందన్ తదితరలు కీలక పాత్రలు పోషించారు.
A house for Rajakannu’s family 🙏🏼 #JaiBhim #Suriya @Suriya_offl @2D_ENTPVTLTD @rajsekarpandian @tjgnan @jbismi14 @valaipechu pic.twitter.com/nJRWHMPeJo
— Raghava Lawrence (@offl_Lawrence) November 8, 2021