ఒక డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృష్టితో అంచలంచెలుగా ఎదిగినవారిలో లారెన్స్ ముందువరుసలో కనిపిస్తాడు. డాన్స్ మాస్టర్ గా దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న లారెన్స్, నిర్మాతగా నటుడిగా కూడా తనకి తిరుగులేదనిపించుకున్నాడు. హారర్ థ్రిల్లర్ సినిమాల కేటగిరిలో ఆయన తనదైన మార్కు చూపించాడు.
కేవలం తమిళంలో కాకుండా తెలుగులో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా కనిపించాడు. ఇక ఇప్పుడు హిందీలో కూడా లక్ష్మీ బాంబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికే చాలా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న రాఘవ లారెన్స్ మరోసారి తనదైన శైలిలో అలరించడానికి సిద్దం అయ్యాడు.
కాంచన రీమేక్ తో బాలీవుడ్ లో డైరెక్టర్ గా లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల విషయంలో గ్యాప్ తీసుకుంటున్నాడు. సాధారణంగా హారర్ థ్రిల్లర్ సినిమాలను ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఎక్కువగా చూస్తుంటారు. అలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తన సినిమాల థియేటర్లకు వచ్చేలా చేయగలగడం లారెన్స్ ప్రత్యేకత. ఇప్పటికీ ఆయన హారర్ సినిమాలను టీవీల్లో ఇంటిల్లిపాది కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
భయానికి కాస్త కామెడీ టచ్ ఇవ్వడమే అందుకు కారణం. అలాంటి లారెన్స్ ప్రస్తుతం ‘రుద్రన్’ ‘అధిగారం’ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ‘దుర్గ’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టులుక్ వదిలాడు. అఘోర, క్షుద్ర మాంత్రిక పాత్రలకు దగ్గరగా ఉన్న ఈ లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. తన సొంత బ్యానర్లో లారెన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, త్వరలో మిగతా విషయాలు తెలియనున్నాయి.
#Durga second look! #RagavendraProductions pic.twitter.com/XjNhGhmylU
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021