‘మొగ్గిన మనసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. 20కిపైగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్లుగా నిలిచాయి.
సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ స్టార్ డమ్ కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. హీరోల స్టార్‌డమ్ పెరుగుతూ పోతుంటే.. హీరోయిన్ల స్టార్‌డమ్ తగ్గుతూ పోతుంది. వయసు, ప్లాపులు ఇతర విషయాలు హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయేలా చేస్తాయి. అందుకే ఎక్కువ మంది ఫేమ్ ఉన్నపుడే సొమ్ము వెనకేసుకుంటూ ఉంటారు. అవకాశాలు తగ్గిపోగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతుంటారు. కానీ, చాలా కొద్ది మంది హీరోయిన్లు మాత్రం స్టార్‌డమ్‌లో ఉన్నా కూడా ప్రేమించిన వారి కోసం ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.
పైన ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిన వారే. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఆమె ఇంకెవరో కాదు.. ప్రముఖ కన్నడ హీరోయిన్, ప్యాన్ ఇండియా స్టార్ యశ్ భార్య రాధికా పండిట్. ఈమె 2008లో వచ్చిన ‘మొగ్గిన మనసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ సినిమాలో తన భర్త యశ్‌తో కలిసి నటించారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు.
మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సమయంలో యశ్‌తో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారం మేరకు 2016లో యశ్, రాధికా పండిట్‌ల పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు కొన్ని సినిమాలకు సైన్ చేసి ఉండటంతో రాధిక 2019వరకు సినిమాల్లో కొనసాగారు. 2019 వరకు 20కి పైగా సినిమాల్లో నటించారు. తర్వాత సినిమాలకు దూరం ఇంటికే పరిమితం అయ్యారు. యశ్, రాధిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. రాధిక తన కుటుంబాన్ని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. అప్పుడప్పుడు భర్తతో కలిసి యాడ్‌లలో మెరుస్తున్నారు.