సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కాంట్రవర్సీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు దూరంగా ఉంటారు కూడా. అయితే.. కొందరు హీరోయిన్లు రెగ్యులర్ గా వార్తల్లో కనిపించకపోయినా.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ వార్తలతోనే హాట్ టాపిక్ గా మారుతుంటారు. తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ రాధికా ఆప్టే.. ఇండస్ట్రీలోని హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా అలాంటివారే అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం పలు చర్చలకు దారితీశాయి.
వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. అటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో బోల్డ్ పాత్రలు చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ పరంగా ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించిన రాధికా.. ఒకానొక సమయంలో పలు కాంట్రవర్సీ సన్నివేశాల కారణంగా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. అలాంటి రోల్స్ ఎందుకు చేస్తున్నావని అడిగితే.. అదంతా నటనలో భాగమే అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇంతకాలం తాను చేసే పాత్రలతోనే వివాదాల్లో నిలిచిన రాధికా.. ఇప్పుడు ఇండస్ట్రీలోని హీరోయిన్ల శరీరాకృతులపై సంచలన కామెంట్స్ చేసింది. న గతంలో టాలీవుడ్ హీరోపై కామెంట్స్ చేయడం సౌత్‌లో రకరకాల చర్చలకు దారితీశాయి. ఆ తర్వాత మళ్ళీ రాధిక తెలుగులో కనిపించలేదు. కానీ, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఇతర భాషలలో నటిస్తూనే ఉంది. పెర్ఫార్మర్‌గా తనకు మంచి పేరుంది. కానీ, ఆమె చేసే కామెంట్స్ వల్ల ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా.. “ఇండస్ట్రీలో శరీరాకృతి కోసం ముఖం, శరీర భాగాలకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్లను చూశాను. పాపులారిటీ కోసం వాళ్ళు పడే ఇబ్బందులన్నీ తెలుసు. కానీ నేను నేను అలా కాదు. అలాంటివి నేను భరించలేను. శరీరాకృతుల(బాడీ పాజిటివిటీ) గురించి మాట్లాడే చాలామంది హీరోయిన్స్ తమ శరీర భాగాలను సర్జరీలతో మార్చుకున్నవారే. ఇలాంటివన్నీ చూసి చూసి నేను అలసిపోయాను” అంటూ చేసిన కామెంట్స్ సినీ వర్గాలలో దుమారం రేపాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాధికా.. విక్రమ్ వేద రీమేక్, మోనికా ఓ మై డార్లింగ్ సినిమాలలో నటిస్తుంది. మరి రాధికా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.