కరోనా ప్రభావం పెరిగిందంటే చాలు.. విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్నాపెద్దా సినిమాలన్నీ వాయిదా పడటమో లేదా OTT బాట పట్టడమో జరుగుతుంటుంది. ఇలాంటి టైంలో చిన్న సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయంటే ఓకే అనిపిస్తుంది. కానీ ఓ పాన్ ఇండియా సినిమా ఓటిటి విడుదలకు రెడీ అవుతోందంటే మాత్రం షాకింగ్ గానే ఉంటుంది. సినిమా బడ్జెట్ స్కేల్, విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయంటే నమ్మలేము.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ విషయంలో అదే జరుగుతోందని సినీవర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇతర కారణాల వలన మేకింగ్ ఆలస్యమైన ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ చాలా ప్రయత్నించారు. ఓ విధంగా కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది సంక్రాంతికి రాధేశ్యామ్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ తప్పని కరోనా పరిస్థితిలో సినిమా విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేయాలని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.
Wishing the greatest nation in love and culture a Happiest Republic Day 🤗🤗#radheshyam in theatres soon.
— Radha Krishna Kumar (@director_radhaa) January 26, 2022
గతంలో వచ్చినట్లే రాధేశ్యామ్ సినిమా ఓటీటీ రిలీజ్ అంటూ తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. కొన్ని వెరిఫైడ్ హ్యాండిల్స్, డిజిటల్ స్ట్రీమింగ్స్ పై అప్‌డేట్స్ అందించే ట్విట్టర్ అకౌంట్లలో ‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్ పై ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రానికి ఓటిటి విడుదలకు భారీ డీల్(500 కోట్లు) వచ్చిందంటూ ట్వీట్స్ పెట్టారు. ఇక నెటిజన్లలో రాధేశ్యామ్ పై చర్చలు మొదలయ్యాయి.
#RadheShyam ONLY IN THEATRES 🎬🙌🏿
GRAND VISUALS
GRAND SOUNDS
GRAND MAKINGAND WITH GRAND LOVE ❤️ FROM OUR TEAM OF #BlockBusterRadheShyam
I WILL WATCH WITH U ALL !! ONLY IN THEATRES WITH TOP NOTCH @DolbyAtmosNL @DolbyCinema 🏆🎬⭐️⭐️⭐️⭐️⭐️
This film 🎥 is full of 🤍
— thaman S (@MusicThaman) January 26, 2022
ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో ప్రొడ్యూసర్స్ పై ఆర్థికభారం పడుతోందని.. మార్చిలో కూడా థియేట్రికల్ రిలీజుకు పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉండవని కథనాలు బయటికి వస్తున్నాయి. కాబట్టి ఈ ఓటిటి ఆఫర్ లాభదాయకంగా ఉండటంతో రాధేశ్యామ్ మేకర్స్ టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఓటిటి విషయం పక్కన పెడితే.. మేకర్స్ తాజాగా సినిమా థియేట్రికల్ రిలీజ్ కన్ఫర్మ్ అంటూ క్లారిటీ ఇస్తూ ట్వీట్స్ పెట్టారు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఓ సినిమాకి ఓటిటి ఆఫర్ 500కోట్లు అనేది ప్రభాస్ రేంజిని చూపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి రాధేశ్యామ్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.