ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు యూవీ క్రియేషన్స్ వారు పెద్ద ఫీస్ట్ ప్లాన్ చేశారు. రాధేశ్యామ్ నుంచి మోస్ట్ అవైటింగ్ అప్‌డేట్ రానే వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ఒకే టీజర్‌ను విడుదల చేయడం కూడా ఇందులో మరో ప్రత్యేకత. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలకు ఎప్పుడూ ఏ భాషకు ఆ భాషలో టీజర్లు రిలీజ్ చేస్తారు. కానీ, రాధేశ్యామ్‌కు మాత్రం ఒకటే టీజర్ ఏడు భాషల్లో సబ్ టైటిల్స్‌ను ఉంచి విడుదల చేశారు. రాధేశ్యామ్ టీజర్‌లో ప్రభాస్ వాయిస్ మాములుగా లేదు. ఈ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. టీజర్ కూడా ఎంతో కొత్తగా ఉంది. మరి ఆ టీజర్‌లోనే కథ మొత్తం చెప్పేశారు.. మీ గమనించారా? టీజర్‌లో దాగున్న ఆ కథాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని మాత్రమే ఇప్పటివరకు తెలుసు. కానీ, డైరెక్టర్ ఈ టీజర్‌తో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో విక్రమాదిత్య భవిష్యత్ తెలిసిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అంటే మాములుగా మనకు తెలిసిన అయ్యగార్లలా కాదులెండి. ఎదుటి వ్యక్తి చావు, పుట్టుక, మలుపు, గెలుపు తెలుసుకోగల వ్యక్తి అనమాట. కానీ, ఆ విషయాలు ఏవీ విక్రమాదిత్య వారికి చెప్పడు. అతను మామూలు జ్యోతిష్యుడులాంటి వ్యక్తి కాదని తెలుస్తోంది. అంతేకాకుండా అతను ఒక భగ్న ప్రేమికుడు అని చెప్పేలా ఉంది టీజర్. టీజర్‌లో విక్రమాదిత్య లవ్స్ ప్రేరణ అని అర్థం వచ్చేలా చెక్కపై పేర్లు ఉన్నాయి.
ఈ సినిమాలో యాక్షన్‌కు అసలు కొదవలేదని తెలుస్తోంది. విక్రమాదిత్య మాములుగా కాకుండా కొన్ని అంతు చిక్కని కేసులను సాల్వ్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడేమో అనే భావన వచ్చేలా ఉంది. నేను దేవుడిని కాదు.. అలాగని మీలోని ఒకడిని కూడా కాదు అన్న డైలాగ్‌తో సినిమా కథ మొత్తం వేరే రేంజ్‌లో ఉండబోతోందని అనిపిస్తోంది. అసలు కథ తెలియాలి అంటే జనవరి 14 వరకు వేచి చూడాల్సిందే. ఇక కె. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు.