యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా నుండి తాజాగా ‘ఈ రాతలే’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇదివరకే యానిమేషన్ వీడియోగా విడుదలైన ఈ సాంగ్.. విశేష ఆదరణ పొంది సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ‘ఈ రాతలే‘ వీడియో సాంగ్ కు అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ రొమాంటిక్ డ్యూయెట్ పాటను అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాటలో 5 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం పంచభూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమీ, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీని కాన్సెప్టు ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి కలిసిపోతారని అర్థం.
ఇక రాధేశ్యామ్ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. మరి ఈ రాతలే సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.