‘రాధే శ్యామ్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉంది. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం కలగడంతో మూవీ ఆలస్య మవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాధే శ్యామ్ లోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేస్తున్నారని, విడుదల ఆలస్యం కావచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటన్నిటికీ చెక్ చెబుతూ రాధాకృష్ణ షూటింగ్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు.
మరో మూడు రోజుల్లో ఈ సినిమా నుంచి మరో సప్రైజ్ ఉంటుందని రాధాకృష్ణ ప్రకటించడంతో అందరూ… ముఖ్యంగా ఫ్యాన్స్ అదేమిటో అనీ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి టీజర్ కానీ ఫస్ట్ సింగిల్ కానీ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే.
రాధే శ్యామ్ లో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. రాధే శ్యామ్ ను కృష్ణంరాజు, టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, ప్రశీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.