స్వాతి చినుకులు సీరియల్ ఫేమ్ రచితా మహాలక్ష్మి తన భర్త దినేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినేష్ తనకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతున్నాడని పేర్కొన్నారు.
ప్రముఖ సీరియల్ నటి రచితా మహాలక్ష్మి వృత్తిపరంగా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆమె తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు, సీరియళ్లు చేశారు. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. వైవాహిక జీవితంలో ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. 2013లో ఆమె తన సహ నటుడు దినేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్యా మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. వేరుగా ఉంటున్నప్పటికి ఇద్దరి మధ్యా వివాదాలు ఆగటం లేదు.
ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఇద్దరూ గొడవలు పడుతూ ఉన్నారు. తాజాగా, కూడా రచిత, దినేష్‌ల మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో రచిత పోలీసులను ఆశ్రయించారు. చెన్నైలోని మంగాడు మహిళల పోలీస్ స్టేషన్‌లో దినేష్‌పై ఫిర్యాదు చేశారు. దినేష్ తనకు అభ్యంతర మెసేజ్‌లు పంపుతున్నాడని.. ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రచిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మూడో వ్యక్తి.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ జీజీ ప్రమోయం ఉన్నట్లు భావిస్తున్నారు. రచిత, దినేష్‌లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
ఇద్దరినీ విచారించారు. తాను భర్తనుంచి విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు రచిత పోలీసులతో తెలిపారు. కాగా, రచిత, దినేష్‌ల మధ్య గొడవలు పెరగటానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ జీజీ కారణమన్న వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు గతంలో జీజీ.. దినేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దినేష్ తనను మానసికంగా వేధిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, రచిత, దినేష్, జీజీల మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి, రచిత భర్త దినేష్‌పై ఫిర్యాదు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.