తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఒకే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు రచ్చ రవి. ఇక తన పంచులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్వించాడు. అయితే అతడి నవ్వుల వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయని, తన చెల్లెలు తన ఇంటికి రావట్లేదని చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు రచ్చ రవి.
మనిషి ఎంత సంపాదించినా గానీ.. కుటుంబానికి మించిన ఆస్తి లేదు. అందుకే చాలా మంది అంటూంటారు నీకేంట్రా.. మీ నాన్న ఉన్నాడు, మీ అమ్మ ఉంది అని. అయితే ప్రస్తుత కాలంలో భవిష్యత్ కోసం కన్న తల్లిదండ్రులను, ఉన్న ఊర్లను వదిలి బతుకుదెరువు కోసం పట్టణాలకు పయణం అవుతున్నారు చాలా మంది. అలా పయణం అయిన చాలా మందిలో రచ్చ రవి ఒకడు. నటనపై తనకున్న పిచ్చితో హైదరాబాద్ వచ్చాడు. ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఓ మంచి నటుడిగా ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే అతడు ఈ స్థాయిలో ఉండటానికి అమ్మానాన్నలతో పాటుగా తన చెల్లి ఎంతో సహాయం చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ స్టార్ కమెడియన్. తన చెల్లెలు ఇచ్చిన రూ. 123 రూపాయలతోనే ఇండస్ట్రీకి వచ్చాను.. కానీ ఈ రోజు నా చెల్లెలు నా ఇంటికి రావట్లేదు అంటూ బోరున ఏడ్చాడు రచ్చ రవి.
రచ్చ రవి.. తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఒకే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ.. దూసుకెళ్తున్నాడు రచ్చ రవి. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ కు సంబంధించిన విశేషాలతో పాటుగా.. తన చెల్లెతో జరిగిన గొడవ గురించి తలచుకుని బోరున ఏడ్చాడు. అతడు ఏడుస్తుంటే మనకు సైతం కన్నీళ్లు రాకమానవు.
ఇక ఈ ఇంటర్వ్యూలో రచ్చ రవి మాట్లాడుతూ..”ప్రతీ రాఖీ పండక్కి నేను నా చెల్లి దగ్గరికి పోయి రాఖీ కట్టించుకుంటాను. అయితే కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు మా ఇంటికి రావడం లేదు. 2016లో నా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన తర్వాత నుంచి మా ఇంటికి రాలేదు. ఇక నేను ఇంత సంపాదించుకున్నాను అంటే దానికి కారణం మా చెల్లి రజితనే. తను ఇచ్చిన రూ. 123 రూపాయల తీసుకునే నేను హైదరాబాద్ కు వచ్చాను. నేను ఇప్పుడు ఇంత సంపాదించి, ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా చెల్లెలే కారణం” అంటూ చెప్పుకొచ్చాడు రచ్చ రవి. అయితే గత కొంత కాలంగా చెల్లెలు రజిత తన ఇంటికి రావాట్లేదని బోరున ఏడుస్తూ చెప్పుకొచ్చాడు.
అదీకాక నేను ఏదైన తప్పు చేస్తే చెప్పాలి కానీ ఇలా ఇంటికి రాకుండా ఉండటం ఏంటి అని కన్నీరు పెట్టుకున్నాడు రచ్చ రవి. నా దగ్గర అన్నీ ఉన్నాయని, కానీ నా చెల్లెలు నా ఇంటికి రాకపోవడమే నాకు అత్యంత బాధాకరమైన విషయమని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. చెప్పాడు. అయితే నా చెల్లెలు నా మీద ఎందుకు అలిగిందో తెలీదు.. అయ్యిందేదో అయ్యింది ఇప్పటికైనా నా ఇంటికి రావమ్మా అంటూ బోరున ఏడుస్తూ.. చెల్లిన వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా రచ్చ రవి నటించిన బలగం సినిమా బ్లక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో తన చెల్లెలిపై అన్న ప్రేమను ఏవిధంగా చూపించాడో.. ఇప్పుడు ఇదే సీన్ రచ్చ రవి ఇంట్లో కూడా రిపీట్ కావడం గమనార్హం. అన్నా చెల్లెలి మధ్య వచ్చిన మనస్పర్థలు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి. అన్న ఇంటికి వెళ్లమ్మ అంటూ కొందరు నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.