తెలుగు ఇండస్ట్రీలో నాగౌశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది రాశీ ఖన్నా. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో రాశీ ఖన్నాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇటీవల రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. సాధారణంగా తమకు గుర్తింపును తీసుకొచ్చిన టాలీవుడ్‌పై పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటం మనం గతంలో చూశాం. తన కెరీర్ కి మంచి బాటలు వేసిన దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
దక్షిణాది వచ్చే మూవీస్ అన్నీ రొటీన్ గా ఉంటాయని.. హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండదని.. కేవలం రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితం అవుతాయని కామెంట్స్ చేసింది. హీరోయిన్ కు పెద్దగా గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవని చెప్పారు. ప్రస్తుతం తనకు బాలీవుడ్ లో మంచి పాత్రలు వస్తున్నాయని.. తనలో కొత్త నటిని చూస్తారని తెలిపారు. అంతే రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. బాలీవుడ్ లో అవకాశాలు రాగానే.. సౌత్ ఇండస్ట్రీ చులకన అయిందా? అంటూ నిప్పులు చెరిగారు. దీంతో, అమ్మడు దిగివచ్చింది.
తాఈ మద్య తనపై లేని పోని విష ప్రచారం జరుగుతుందని.. దక్షిణాది సినీ పరిశ్రమపై తాను ఎప్పుడూ కించపరిచే విధంగా మాట్లాడలేదని.. అన్ని ఇండస్ట్రీలు సమానమని చెబుతోంది. తనకు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలు అంటే గౌరవం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. నకు ఏ పాపం తెలియదని.. దయచేసి తన పేరుతో వస్తున్న వార్తలను సోషల్ మీడియా నుండి తొలగించాలంటూ ఆమె ఈ సందర్భంగా కోరింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY
— Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022