ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ గా రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా.. డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. థియేటర్స్ లో రిలీజైన సినిమాలైనా ఏదొక రోజు తిరిగి ఓటిటిలోకే రావాల్సి ఉంటుంది. సో.. పెద్ద చిన్న సినిమాలనే తేడా లేకుండా సినిమాలను ఎప్పటికప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్స్ లో విడుదలైన ఓ సినిమా.. రిలీజైన నలభై రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
రీసెంట్ గా డిసెంబర్ 30న థియేట్రికల్ రిలీజ్ అయిన చిన్న సినిమాలలో ‘రాజయోగం’ ఒకటి. సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి వాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని డైరెక్టర్ రామ్ గణపతి తెరకెక్కించగా.. నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా మూవీ నిర్మించారు. రొమాంటిక్ లవ్ యాక్షన్ జానర్ లో రూపొందిన ఈ మూవీ.. థియేట్రికల్ గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు రామ్ గణపతికి ఈ సినిమా డెబ్యూ కాబట్టి.. స్క్రిప్ట్, మేకింగ్ విషయాలలో తడబడ్డాడని సినీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. రిలీజ్ అయ్యాక ఏ సినిమా అయినా ఓటిటిలోకి రావాల్సిందే కదా! ఇప్పుడీ రాజయోగం కూడా అదే బాటలో చేరనుంది. విడుదలైన నలభై రోజుల్లోనే ఓటిటి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ రోమ్ -కామ్ మూవీ డిజిటల్ రైట్స్ ని ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ సంస్థ సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమా వాలెంటైన్స్ డేకి ముందే ఓటిటి రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 9 నుండి రాజయోగం మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరి థియేట్రికల్ గా నిరాశపరిచిన రాజయోగం మూవీ.. ఓటిటిలో ఎలాంటి సందడి చేయనుందో చూడాలి. మరి ఓటిటి సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Brace yourselves for an ultimate cocktail of love, lust, fun, and action 🍹❤️🔥#Raajahyogam premieres Feb 9 only on #DisneyplusHotstar #RaajahyogamOnHotstar#SaiRonak #AnkitaSaha #Bismi#RamGanapathi #ManiLakshman #Shyam #Nandakishore #VaishnaviNatrajProduction pic.twitter.com/LN3wdvvIRG
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 2, 2023