టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి అన్ని సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. సమావేశం అనంతరం చిరు టీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పీపుల్స్ స్టార్ మెగాస్టార్ కు సరదాగా పంచ్ వేశారు.
ఆర్ నారాయణ మూర్తి ఈరోజుల్లో ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి గురించి మాట్లాడారు. చిన్న సినిమాలను ఆడించే పరిస్థితి లేదని, అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సగటు సినిమాల మనుగడ కాపాడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇచ్చేలా చూడాలని నారాయణమూర్తి కోరారు.
ఇక అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవిని పిలవగా, ఆయన వినయంగా చెప్పండి సార్ అంటూ ముందుకు వచ్చారు. దీంతో నారాయణ మూర్తి ‘అంతొద్దు సార్’ అంటూ చిరుపై ఫన్నీగా పంచ్ వేయడంతో చిరుతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వారు. మొత్తానికి అక్కడ సరదా సన్నివేశం నెలకొంది. ఏది ఏమైనా ఈ రోజు జరిగిన మీటింగ్ పై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఈ పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే ఇండస్ట్రీ సమస్యలన్నీ తీరినట్టే అన్పిస్తోందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.