తెలుగు సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన రాజ్-కోటి ద్వయంలో ఒకరైన సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరన్న వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతలోనే శరత్ బాబు చనిపోయారంటూ పిడుగులాంటి వార్త. తెలుగు, తమిళ పరిశ్రమలోని ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలీవుడ్‌లో కూడా ఇవే వార్తలు. యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, మరో నటుడు నితేష్ పాండే తుది శ్వాస విడిచారు. తాజాగా ప్రముఖ షింగర్ ఇక లేరన్న వార్త వినిపించింది.
హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఏ సినీ రంగంలో చూసినా విషాద వార్తలే వినిపిస్తున్నాయి. నటీనటుల దగ్గర నుండి దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఈ వారంలోనే అనేక మంది ఈ లోకాన్ని విడిచి.. అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నారు. తెలుగు సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన రాజ్-కోటి ద్వయంలో ఒకరైన సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరన్న వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది. అంతలోనే శరత్ బాబు చనిపోయారంటూ పిడుగులాంటి వార్త. తెలుగు, తమిళ పరిశ్రమలోని ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలీవుడ్‌లో కూడా ఇవే వార్తలు. యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, మరో నటుడు నితేష్ పాండే తుది శ్వాస విడిచారు. ప్రముఖ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ ప్రమాదంలో మరణించింది. అలాగే డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ ప్రాణాలు విడిచారు. ఇక హాలీవుడ్ నటి సమంత అనారోగ్యంతో చనిపోయింది. తాజాగా మరో సెలబ్రిటీ ఇక లేరన్న వార్త వచ్చింది.
హాలీవుడ్ ప్రముఖ సింగ్ టీనా టర్నర్ తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 83 సంవ్సరాలు. అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సమస్యలతో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ సమీపంలోని కుస్నాచ్ట్‌లోని తన ఇంటిలో బుధవారం మరణించారు. ఆమె పేరు చెబితే తెలియదు కానీ రాక్ అండ్ రోల్ సాంగ్ విన్నవాళ్లకు సుపరిచితమే. ఆమెకు క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అనే బిరుదు ఉంది. తన గాత్రంతో సంగీత ప్రియులను వీనుల విందు చేసింది. సోలోగా ఆమె ఎన్నో ఫెర్మామెన్స్ ఇచ్చింది. టీనా నవంబర్ 26, 1939న అమెరికాలో జన్మించారు. ఆమె 1960-70 మధ్యకాలంలో ఆమె భర్త ఐకే టర్నర్‌తో కలిసి ఫేమస్ అయింది. ఆమె తన వాయిస్, ప్రదర్శనలతో రాక్, సోల్ సంగీతంలో పేరు సంపాదించారు. అయితే ఆ తర్వాత భర్తతో విడిపోయిన టీనా సోలోగా కెరీర్‌ను ప్రారంభించింది. 1980వ దశాబ్దంలో ఆమె అనేక సాంగ్స్ పాడింది.
“టిపికల్ మేల్,” “ది బెస్ట్,” ,”ప్రైవేట్ డ్యాన్సర్” , “బెటర్ బీ గుడ్ టు మీ”తో సహా టాప్ 40లో ఒక డజను పాటలను ఆమెనే పాడారు. 1980లో ఆమె ఆరు గ్రామీ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 1988లో రియో డి జనీరోలో ఆమె ఇచ్చిన ప్రదర్శనకు లక్షా ఎనభై వేల మంది హాజరయ్యారట. ఇప్పటికీ అదే అతిపెద్ద రికార్డుగా మిగిలిపోయింది. ఆమె సంగీతంతో పాటు నటనలోకి ప్రవేశించారు. టామీ, మ్యాడ్ మాక్స్ బియాండ్ థండర్‌డోమ్, వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్ వంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు చేశారు. టీనా సంగీతానికి గ్రామీ అవార్డులతో పాటు రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్, కెన్నెడీ సెంటర్ ఆనర్స్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.