భారతదేశంలో సినిమా పరిశ్రమకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేల కోట్లకు పడగలెత్తుతోంది. ఇది గమనిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే థియేటర్ సంప్రదాయంలో కొత్త కొత్త పద్దతులను తీసుకొస్తున్నాయి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు. పట్టణాలు, నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ లను విమానాశ్రయాల్లోకి కూడా విస్తరిస్తున్నా కార్పోరేట్ దిగ్గజాలు. అందుకు ముందడుగు వేసింది PVR యాజమాన్యం. ఇండియాలో మెుదటిసారి విమానాశ్రయాంలో సినిమా థియేటర్ ను ప్రారంభించినట్లు పీవీఆర్ సంస్థ ప్రకటించింది.
సాధారణంగా విమానాలు ఆలస్యంగా నడవడం, రద్దు అయిన సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురవుతుంటారు. ఇక గంటలకు గంటలు కాళీగా కూర్చుంటే.. వారికి బోర్ కొడుతుంది కూడా. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది ప్రముఖ మల్టీప్లెక్స్ యాజమాన్యం పీవీఆర్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పీవీఆర్ మల్టీప్లెక్స్ అతిపెద్ద యాజమాన్యం. ఇక దేశంలోనే మెుట్టమెుదటి మల్టీప్లెక్స్ ను ఎయిర్ పోర్ట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినట్లు బుధవారం ప్రకటించింది. చెన్నై విమానాశ్రయంలో తన కొత్త ఏరోహబ్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించినట్లు పీవీఆర్ సినిమాస్ తెలిపింది. దాంతో ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన మెుట్టమెుదటి మల్టీప్లెక్స్ గా ఈ ఏరోహబ్ రికార్డు నెలకొల్పింది. 1,155 మంది కెపాసిటీతో ఐదు స్క్రీన్లలో ఈ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసింది.
ఇక విమానాలు ఆలస్యంగా నడిచే క్రమంలో వెయిటింగ్ సమయంలో వారికి ఎంటర్టైన్ మెంట్ అందించడంతో పాటుగా ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ మల్టీప్లెక్స్ అందుబాటులో ఉంటుంది అని, ఈ థియేటర్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినట్లు PVR లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ తెలిపారు. ట్రాన్సిట్ ప్రయాణీకులు తమ ఖాళీ టైమ్ ను సద్వినియోగం చేసుకోవడానికి సినిమాలు చూడటం కంటే మరో మంచి మార్గం లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి ఎయిర్ పోర్ట్ లో తొలిసారిగా ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#PVRAerohub – 5 screen state of art new PVR Cinemas opened at the Chennai Airport. This is the first multiplex in the country to be located within an airport. pic.twitter.com/Ahn9DLEPHj
— LetsCinema (@letscinema) February 1, 2023