ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది.
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్ల రూపాయల ట్రేడ్ మార్క్‌ను దాటేసిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక జనవరి 7న విడుదల కావాల్సిన RRR సినిమా వాయిదా పడటంతో, పుష్ప సినిమా జోరు ఇంకా కొనసాగుతోంది. మరి కొన్ని రోజులు ధియేటర్స్ లో పుష్ప మూవీ వసూళ్లు కంటిన్యూ కానున్నాయి.
ఇదిగో ఇటువంటి సమయంలో పుష్ప సినమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి త్వరలోనే పుష్ప సినిమా ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు జనవరి 7న పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
It’s official now #Pushpa confirmed it’s ott release. only on @PrimeVideoIN #Pushpa #PushpaTheRise #pushpaonprime pic.twitter.com/GHQZput9vY
— Pavan Kushi (@Bhemlaa) January 4, 2022
ఈమేరకు అమెజాన్ ప్రైమ్ తో పుష్ప మేకర్స్ భారీ రేట్ కు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. వరుసగా విడుదలకు సిద్దంగా ఉన్న పాన్ ఇండియా సినిమాల కంటే ముందే, ఓటీటీలో సైతం విడుదల చేస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చని యూనిట్ భావిస్తోంది. అందుకే సంక్రాతి పండగను దృష్టిలో పెట్టుకుని జనవరి 7న పుష్పను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.