ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ఫ. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతూ ప్రశంసలు అందుకుంటోంది. గత రెండు రోజుల నుంచి హౌస్ ఫుల్ షోలతో థియేటర్ లో బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఊ అంటావా మావ ఉ.. ఉ.. అంటావా మావా అనే ఐటెమ్ సాంగ్ వరుస వివాదాలతో నడుస్తుంది. సాంగ్ విడుదలైన కొన్ని రోజులకే లిరిక్స్ పై పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని కొందరు అల్లరి అల్లరి చేశారు.
ఈ సినిమాకి ఇన్ని వివాదాలు చుట్టముట్టడంతో తాజాగా మరో అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల ఐటెమ్ సాంగ్ పై వస్తున్న విమర్శలను అక్కడితో సరిపెడదమనుకుంటే ఈ సారి ఏకంగా సినిమా స్టోరీపైనే వివాదం రాజుకుంది. అవును మీరు విన్నది నిజమే. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆదినారాయణ సినిమా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈయన మూవీ రివ్యూలో రాయడంలో దిట్ట. ఇక సినిమాలపై ఉన్న ఇష్టంతో సొంతంగా కథలు కూడా రాస్తుంటారు. అయితే ఆయన తాజాగా డైరెక్టర్ సుకుమార్ నేను రాసుకున్న కథను కాపీ చేసి పుష్ఫ సినిమా తెరకెక్కించారని బాంబ్ పేల్చుతూ ఫేస్ బుక్ లో ఓ ఫోస్ట్ పెట్టాడు.తాజాగా ఆయన చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక ఆయన పోస్ట్ గనుక చూస్తే.. నేను రంగస్థలం సినిమా రివ్యూను రాయడంతో తనను మెచ్చుకుని సుకుమార్ ప్రశంసించారని, ఆ సమయంలో సుకుమార్ ఓ కేజీఎఫ్ లాంటి మాస్ కథ కావాలని నాకు చెప్పాడు. దీంతో వెంటనే నేను రాసుకున్న ఎర్రచందన బ్యాక్ డ్రాప్ కథను సుకుమార్ కు వివరించాను. మాస్ ఎలివెన్స్ కావాలంటే పూర్తి కంటెంట్ ని కూడా ఇచ్చానంటూ తను పెట్టిన పోస్ట్ లో తెలిపారు. ఆ తర్వాత ఏమైందో కానీ సినిమాగా విడుదలైంది పేర్కొన్నారు. ఇక దీంతో పాటు తను రాసిన కథను, మెయిల్ తో సహా జర్నలిస్ట్ ఆదినారాయణ జత చేస్తూ పోస్ట్ చేశారు. ఇక జర్నలిస్ట్ ఆదినారాయణ ఆవేదనపై పుష్ఫ సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత ఎవరైన స్పందిస్తారో లేదో చూడాలి మరి. ఇక ఆదినారాయణ చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.