ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా కొత్త రికార్డ్‌లను సృష్టిస్తుంది. రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చినా.. రెండో రోజు నుంచి సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా పుష్ప.. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతుంది. వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా పుష్ప సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా 35 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. 2021లో విడుదలైన ఏ తెలుగు సినిమాకు దక్కని రికార్డ్ ఇది.
Last time which South film did this kind of phenomenal business with almost zero promotion, difficult to remember! On its Second Sunday ‘Pushpa’ is destroying the BO in the same aggression. Lake Mall, Avani, PVR Diamond plaza are already HOUSEFULL, Inox.. pic.twitter.com/ifnmwGDZs4
— Box Office Bengal (@OfficeBengal) December 26, 2021
సినిమా అరుదైన రికార్డును దక్కించుకుంది. బన్ని వన్ మ్యాన్ షోతో పుష్ప సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . ఇక విడుదలకు ముందు ఉన్న అంచనాలను ఆదుకోవడంలో పుష్ప రాజ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రస్తుతం సుకుమార్ పార్ట్ 2 పై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఈ రెండో భాగం షూటింగ్ మొదలు కానుంది. మరి పుష్ప సినిమా సృష్టిస్తున రికార్డ్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.