భారీ మాస్ యాక్షన్ మూవీ పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నారు డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా పై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ ని ఇంతవరకు చూడని ఊరమాస్ లుక్కులో చూపించనున్నాడు లెక్కల మాస్టర్. డిసెంబర్ 17న పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. చిత్రబృందం కూడా సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. డిసెంబర్ 12న ప్రీ-రిలీజ్ ప్రోగ్రాం కూడా చేయనున్నారు.
అయితే తాజాగా పుష్ప సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. సినిమా నిడివి 2గంటల 59 నిమిషాలు ఉందని టాక్. సెన్సార్ విషయం తెలిసే సరికి సినిమా ఎలా ఉండబోతుంది? అనే టాపిక్ పై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ లో చూసినట్లే అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం కొత్తగా ఉండబోతుంది. కానీ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్. ట్రైలర్ లో కూడా ఏమి చూపించలేదు.
అంటే ఫాహద్ క్యారెక్టర్ స్పెషల్ గా ఉండబోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రష్మిక కూడా నేచురల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. అలాగే సైడ్ క్యారెక్టర్స్ లో సునీల్ – అనసూయ కొత్తగా కనిపిస్తున్నారు. అంటే సుకుమార్ పుష్ప పార్ట్-1 భారీగానే ప్లాన్ చేసాడని అర్ధమవుతుంది. అందులోను సమంత ఐటమ్ సాంగ్ అంటే మాస్ ప్రేక్షకులకు విందు వేరే లెవెల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.