ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఏలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈసినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈసినిమాలో డైలాగ్స్ , సాంగ్స్,.. ఇలా ప్రతీదీ ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఈచిత్రంలో ముఖ్యంగా “తగ్గేదేలే”అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ పడ్డ కష్టం కనిపిస్తోంది. అయితే ఈ మూవీలో పుష్పరాజ్ పాత్ర తరువాత అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కేశవ పాత్రే. జగదీశ్ ప్రతాప్.. కేశవ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అందులో చాలా సింపుల్ గా కనిపిస్తాడు. అయితే తాజాగా కేశవ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ లుక్ లో కేశవ కనిపిస్తూ.. పుష్పాలో కనిపించే కేశవ కు పూర్తి విరుద్దంగా ఉంటూ అందరని ఆకట్టుకున్నాడు.
పుష్ప సినిమా ఎంతగా హిట్ అయిందో.. కేశవ పాత్ర జనాల్లోకి అంతగా వెళ్లిపోయింది. బన్నీ తరువాత కేశవ పాత్రలో నటించిన జగదీష్‌కే ఎక్కువ పేరు వచ్చింది. అలా ఒక్కసారిగా జగదీష్ అలియాస్ కేశవ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అతడు ఇండస్ట్రీలో చాలా కాలం పాటు పడుతున్న కష్టానికి ఈ సినిమాతో ఫలితం దక్కేసింది. ఇప్పుడు కేశవ అంటే మామూలోడు కాదు. తాజాగా కేశవకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో రింగుల జుట్టు, నల్ల కళ్ల అద్దాలు, నోట్లో సిగరెట్ పెట్టుకుని మాస్ లుక్ లో కనిపించాడు. అసలు విలన్ ఇతనేనా అనే అంతలా ఆఫిక్ లో పవర్ మాస్ లుక్ లో కనిపిస్తాడు. అయితే పుష్పా-2లో ని ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం కేశవ అలా గెటప్ మార్చి ఉంటాడని కొందరు, పుష్పా-2 మూవీలో అసలు విలన్ కేశవే.. అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.