ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ మూవీ పుష్ప. ఈ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ రఫ్ లుక్కుతో యాక్టింగ్ అదరగొట్టాడని చెప్పవచ్చు. అల్లు అర్జున్ అక్రర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా.. పుష్ప ఐదు భాషల్లో రిలీజయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప.. రిలీజైన మొదటిరోజు నుండే కలెక్షన్స్ పరంగా బాగానే దూసుకుపోతుంది.
మొదటి మూడు రోజుల్లో 173కోట్ల గ్రాస్ వసూల్ చేసిన పుష్ప దూకుడు.. 4వ రోజు కొంచం తగ్గినట్లుగా తెలుస్తుంది. మరి వీకెండ్ లో అదరగొట్టిన పుష్పరాజ్.. మూడు రోజుల్లోనే 107కోట్ల షేర్ రాబట్టడం విశేషం. అయితే.. 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప మూవీ 14 – 16 కోట్లు వసూల్ చేసినట్లు సమాచారం. మరి మేకర్స్ అధికారికంగా వసూల్ లెక్కలు బయట పెట్టలేదు. కానీ ట్రేడ్ వర్గాల ప్రకారం.. పుష్ప సేఫ్ జోన్ లోకి చేరాలంటే కలెక్షన్స్ మరికొంత జోరు పెంచాల్సిందేనని టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. ప్రస్తుతం బన్నీ ఫాన్స్ పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారు.