హీరో అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా పుష్ప ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవైపు ఒమిక్రాన్ భయం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ మంచి వసూళ్లను రాబట్టుకున్నాడు. పూర్తిస్థాయి మాస్ యాక్షన్ మూవీగా పుష్ప విడుదలైన మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
బన్నీ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా పుష్ప నిలిచిందని చెప్పవచ్చు. ఒరిజినల్ తెలుగులో అయినప్పటికీ మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లతో కలిపి పుష్ప 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప.. నిడివి కారణంగా స్క్రీన్ ప్లే లో పట్టు మిస్ అయిందని అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పటికి పుష్ప రిలీజై మూడు వారాలు దగ్గరపడినా కొన్ని ఏరియాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 18వ రోజున పుష్ప: ది రైజ్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్క్ అందుకోగలిగింది. నార్త్ తో పాటు తమిళనాడు ప్రేక్షకులు కూడా పుష్ప సినిమాని ఆదరిస్తున్నారు.తాజాగా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా మాట్లాడుతూ.. గతేడాది వచ్చిన అన్ని సినిమాల్లో కంటే పుష్ప పుంజుకుంది. మొదటి వారాంతం కంటే పుష్ప 3వ వారంలో అధిక వసూళ్లను సాధించింది. హిందీ వెర్షన్ ఆదివారం 6.25cr రాబట్టగా.. కేవలం హిందీలో రూ.62.94cr గ్రాండ్ టోటల్ కలెక్ట్ చేయడం విశేషం. అప్పుడప్పుడు అంతరాయాలు ఎదురైనప్పటికీ, పుష్ప పాన్ ఇండియా వైడ్ గా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. మరి పుష్ప విజయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
#PushpaHindi rises above all!!!
The film has achieved 3rd weekend higher than the first weekend. Collects 6.25cr on Sunday with a grand total of Rs. 62.94cr. Inspite of disruptions in shows, Pushpa Hindi is rising Pan India. The film is on its way to create milestones each day!— Ramesh Bala (@rameshlaus) January 3, 2022