సాధారణంగా థియేటర్లలో నుండి సినిమాలు వెళ్లిపోయాయి అంటే వెంటనే మర్చిపోతాం. కానీ థియేటర్స్ లో నుండి సినిమా వెళ్లిపోయాక కూడా ఆ సినిమా ఇంపాక్ట్ కంటిన్యూ అవడం అనేది కొన్ని సినిమాల విషయంలోనే జరుగుతుంది. ప్రస్తుతం పుష్ప సినిమా ఇంపాక్ట్ ఆ విధంగానే కంటిన్యూ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా.. సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది.
పుష్ప పాటలు, డైలాగ్స్ సోషల్ మీడియా రీల్స్ లో వైరల్ అవుతుంటే.. పుష్ప మేనరిజం బయట అభిమానులలో కనిపిస్తుంది. తగ్గేదేలా అంటూ సెలబ్రిటీల దగ్గరనుండి నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్ల వరకు పుష్పరాజ్ ని ఇమిటేట్ చేస్తూ రీల్స్, వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ కాస్త భుజం పైకెత్తి శారీరక వైకల్యం ఉన్న పాత్రలో కనిపించాడు.
తాజాగా నెట్టింట పుష్ప పేరుతో ఓ ఆటో పిక్ వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలో ఆటో పైభాగం ఓవైపు పెరిగినట్లు కనిపిస్తోంది. అచ్చంగా పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రను పోలి ఉండటం విశేషం. అదీగాక ఆటో మీద పుష్ప ఆటో అని రాసి ఉండటం మనం చూడవచ్చు. ఈ ఫోటో చూసైనా అర్ధం చేసుకోవచ్చు పుష్పరాజ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో.. మరి ఈ పుష్ప ఆటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Pushpa #Auto 😂
📸: @mruduls pic.twitter.com/J3neWeEO8T
— Hi Hyderabad (@HiHyderabad) January 31, 2022