టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై చాలాకాలంగా ఎన్నో పుకార్లు వచ్చాయి. సొంత కుటుంబాన్నే దూరం పెడుతున్నాడు అంటూ కామెంట్ చేశారు. అయితే అలాంటి రూమర్స్ కు పూరీ జగన్నాథ్ చెక్ పెట్టారు. చాలాకాలం తర్వాత తమ కుటుంబంతో కలిసి సందడి చేశాడు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. తన కథ, టేకింగ్, డైలాగ్స్, యూత్ ని అప్రోచ్ అయ్యే తీరు చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎంతో మందిని స్టార్లుగా చేశాడు. కానీ, పూరీ మాత్రం ప్రస్తుతం కెరీర్ లో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండతో చివరిగా తీసిన పాన్ ఇండియా సినిమా లైగర్ సక్సెస్ కాలేకపోయింది. మూవీ పెట్టుబడుల విషయంలో కూడా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే మూవీ కెరీర్ పక్కన పెడితే పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. భార్యతో విడాకుల దాకా వెళ్లారంటూ కామెంట్స్ వినిపించాయి. వాటంన్నింటికి పూరీ తన స్టైల్ లో చెక్ పెట్టాడు.
పూరీ జగన్నాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలానే పుకార్లు వచ్చాయి. కావాలనే ఫ్యామిలీకి దూరంగా ముంబయిలో ఉంటున్నాడని, ఛార్మీతో కలిసి తిరుగుతున్నారని, హైదరాబాద్ కూడా కావాలనే రావడం లేదంటూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఒకడుగు ముందుకేసి పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఆ పుకార్లపై పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అవన్నీ అబద్దాలంటూ చెప్పాడు. కానీ, ఆ రూమర్స్ కి మాత్రం బ్రేక్ పడలేదు. షికార్లు చేస్తున్న పుకార్లపై పూరీ జగన్నాథ్ ఒక్క కామెంట్ కూడా చేయకుండా కొన్ని ఫొటోలతో చెక్ పెట్టేశాడు.
ప్రస్తుతం పూరీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తమ సొంతూరు నర్సీపట్నంలో అన్నదమ్ములు, భార్యాపిల్లతో కలిసి పూరీ సందడి చేశారు. అందరితో కలిసి హోమంలో పాల్గొన్నారు. ఫ్యాన్స్ భార్య లావణ్యతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పూరీ జగన్నాథ్ ఫొటోలు షేర్ చేస్తూ సంతోషంగా ఉందన్నారు. అన్నా వదినలను ఇలా చూడంటం ఆనందంగా ఉంది అంటూ తెలిపారు. మరోవైపు మహేశ్ ఫ్యాన్స్ అంతా.. అన్నతో మూవీ ఎప్పుడో కన్నుక్కోవాలంటూ బండ్లన్నకు రిక్వెస్టులు పెడుతున్నారు. పూరీ జగన్నాథ్.. మెగాస్టార్ చిరంజీవి, విశ్వక్ సేన్ తో సినిమా చేస్తున్నాడంటూ టాక్ వచ్చినా.. అవి ఇంకా సెట్స్ దాకా రాలేదు.