విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. భారీ అంచనాలు.. బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన చిత్రం లైగర్. ప్రమోషన్స్‌తో సినిమా మీద హైప్‌ను ఓ రేంజ్‌లో పెంచారు చిత్రబృందం. అయితే రిజల్ట్ మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. పూరి కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది లైగర్. ఇక ఈ సినిమాకు చార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు లైగర్ సినిమాను భారీ ధరకే కొనుగోలు చేశారు. కానీ, ఫలితం తారుమారు కావడంతో.. వారంతా తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో బయ్యర్లు.. తమను ఆదుకోవాలని పూరీ జగన్నాథ్‌ను కోరారు. ఆయన సైతం కొంత డబ్బు వెనక్కి ఇస్తానని మాటిచ్చారు.
కాకపోతే.. తనకు కొంత సమయం కావాలని పూరి కోరారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు సైతం పూరీ నుంచి డబ్బు ఆశిస్తున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అంతేకాక.. ఎగ్జిబిటర్లంతా కలిసి.. పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాలని అనుకున్నారట. ఈ విషయం కాస్త పూరికి తెలియడంతో.. ఆయన ఎగ్జిబిటర్ల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు పూరి ఆడియో కాల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఈ క్రమంలో పూరి జగన్నాథ్ ఓ బయ్యర్‌కు పెట్టిన ఆడియో మెసేజ్‌గా ప్రచారం అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లో ఇలా ఉంది.. ‘‘ఏంటి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.. నేను ఎవరికీ తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను. ఎందుకు.. పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని భావించాను కాబట్టి. మేం ఇప్పటికే బయ్యర్స్‌తో మాట్లాడాం. ఒక అమౌంట్ ఇస్తామని చెప్పాం. వాళ్లు ఒప్పుకున్నారు. ఒక నెల సమయం అడిగాను. ఎందుకంటే నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. అవి వచ్చాక ఇస్తానని చెప్పాను. మాట ఇచ్చిన తరవాత కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధికాదు. పరువు కోసం ఇస్తున్నాం.. నా పరువు తీయాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను’’ అని మండిపడ్డట్టుగా ఆడియోలో ఉంది.
‘‘ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని సినిమాలు ఆడతాయి. కొన్ని సినిమాలు పోతాయి. పోకిరి చిత్రం దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు.. బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు భారీ మొత్తం బకాయి ఉన్నాయి. బయర్స్ అసోసియేషన్ నాకు ఆ మొత్తాన్ని వసూలు చేసి పెడుతుందా.. ధర్నా చేస్తాం అని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరిస్తున్నారు.. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని.. వాళ్ళకి తప్ప మిగతావాళ్ళకి డబ్బులు ఇస్తాను’’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఓ ఆడియో కాల్, మెసెజ్ వైరల్ అవుతోంది. మరి ఇది వాస్తమో కాదో పూరి జగన్నాథ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇక లైగర్ ఫ్లాప్ నేపథ్యంలో ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని భావించారట. ఈ మేరకు కొన్ని లేఖలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. దానిలో ఉన్న దాని ప్రకారం.. ‘‘అక్టోబర్ 27న ఉదయం 9 గంటలకు.. ఎగ్జిబిటర్లం.. పూరి జగన్నాథ్ ఆఫీస్ దగ్గర ధర్నాకి వెళ్తున్నాము. కావున ప్రతి ఒక ఎగ్జిబిటర్ కనీసం నాలుగు రోజులు అక్కడే ఉండటానికి వీలుగా.. అన్ని ఏర్పాట్లు చేసుకుని.. మీతో పాటు మరో నలుగురు వ్యక్తులను తీసుకొని రావాలి. ఎవరైనా రాకపోతే.. ఈ బాధితుల లిస్టులో నుంచి మీ పేరు తొలగించి మీకు రావాల్సిన డబ్బులని రాకుండా క్యాన్సిల్ చేస్తాము. దీన్ని హెచ్చరికగా భావించకుండా తప్పనిసరిగా రాగలరు. డబ్బులు వద్దు అనుకున్న వాళ్లు మాత్రం రాకండి’’ అని లేఖలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. మరి వీటిలో ఏది వాస్తవమో కాదో తెలియాలంటే.. దీనిపై పూరి జగన్నాథ్, కానీ బయ్యర్లు కానీ స్పందించాలి.