టాలీవుడ్ డేరింగ్ అండ్ డేషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తన జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. కింద నుంచి పైకొచ్చిన ఆయన ఒకానొక దశలో పై నుంచి అమాంతం కింద పడిపోయారు. అవును జీవితం అంటే వైకుంఠపాళి ఆట. ఈ ఆటలో ఎప్పుడు నిచ్చెనలు అందుకుంటామో, ఎప్పుడు కింద పడిపోతామో తెలియదు. అలా పడిపోయి లేచిన వ్యక్తే పూరీ జగన్నాథ్. 100 కోట్ల దాకా నష్టపోయిన తర్వాత కూడా ధైర్యంగా నిలబడి వరుస హిట్స్ కొట్టి పైకొచ్చారు. ఆ గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ ధైర్యానికి సెల్యూట్ చేయాలి. అయితే గత కొన్ని రోజులుగా పూరీ సినిమాలు జనాన్ని ఆకట్టుకోవడం లేదు. మొన్నా మధ్య వచ్చిన లైగర్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయినప్పటికీ పూరీ దిగులు చెందలేదు. ఎందుకంటే జీవితం ఇంకా అయిపోలేదు, జీవితంలో ఇంకా ఆట అయిపోలేదు అని తన అభిప్రాయం కాబట్టి.
కానీ అందరూ అలా ఉండరుగా. సక్సెస్, ఫెయిల్యూర్ ని ఈజీగా తీసుకోలేరు. లైగర్ సినిమాతో తమకు నష్టాలూ వచ్చాయని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీ జగన్నాథ్ పై విరుచుకుపడ్డారు. తమని మోసం చేశాడంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. పూరీ వల్ల తమ జీవితాలు నాశనమైపోయినట్టు కొంతమంది పూరీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ పూరీ జగన్నాథ్ సమాధానమిస్తూ ఒక ఓపెన్ లెటర్ ను రాసుకొచ్చారు. ఆ లెటర్ చూస్తే చాలా డెప్త్ గా, ఎమోషనల్ గా ఉంది. సక్సెస్ అండ్ ఫైల్యూర్, ఈ రెండూ వ్యతిరేకం అనుకుంటాం, కాదు ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పీలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చేయాల్సిన పని ఏంటి? ఊపిరి వదిలేయడమే.
పడతాం, లేస్తాం, ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు తర్వాత జరిగేది ఏంటి? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. లైఫ్ లో మనకి జరిగే ప్రతీ సంఘటనని మనం ఒక అనుభవంలా చూడాలి తప్ప.. ఫెయిల్యూర్, సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలు జారింది. నదిలో పడ్డా, కొట్టుకుపోయా, ఒడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వెలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే.. షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ ఏదో ఒకటి పొందుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదీ లేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు.
చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడు వ్యక్తులు అందరూ మాయమైపోతారు.. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి.. అది రిస్క్ అవ్వాలి. లైఫ్ లో రిస్క్ చేయకపోతే అది జీవితమే కాదు. ఏ రిస్క్ చేయకపోతే అది ఇంకా రిస్క్. జీవితంలో లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు. అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ లైఫ్ లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకునే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయితీపరుడ్ని అని చెప్పుకోనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. నిజం ఎప్పుడూ తనను తాను రక్షించుకుంటుంది.
నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న audience ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. ACTUALLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా, వాళ్ళని entertain చేస్తా.
– #PuriJagannadh
@PuriConnects 👍 pic.twitter.com/KdjJEUb7YL— BANDLA GANESH. (@ganeshbandla) October 30, 2022
ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప.. నేను ఎవరినీ మోసం చేయలేదు. నిజానికి నేను నా ప్రేక్షకులకి సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడ నుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా. ఇది పూరీ రాసిన భావోద్వేగభరిత లేఖ. గుండెని తాకేలా తన ఎమోషన్ ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది.
పూరీ రాసిన ప్రతీ మాట తన జీవితంలో జరిగిందే. నేనింతే సినిమాలో ఒక మాట రాశారు. “రేయ్ సపోజ్ సినిమా పోయింది ఇంటికెళ్ళిపోతామా? సినిమా సూపర్ హిట్ అయ్యింది సినిమా తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. సినిమా ప్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదు. దీనికి తప్ప మనం దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే సినిమా, సినిమా, సినిమా” అని చెప్పే డైలాగ్ పూరీ జగన్నాథ్ కి కరెక్ట్ గా సూటవుతుంది. పూరీ రాసిన లేఖ చదువుతుంటే ఒక మాట అనాలనిపిస్తుంది. పూరీ సినిమా ప్లాప్ అయ్యింది, ఆయన సినిమాలు చూడ్డం మానేస్తామా? హిట్ అయ్యింది, చూడకుండా ఉంటామా? హిట్ అయినా, ప్లాప్ అయినా పూరీ సినిమాలు చూస్తూనే ఉంటాం. పూరీ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంటాం. మీరు రండి పూరీ సార్.. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ మీ కోసం. పూరీ ఓపెన్ లెటర్ పై పలువురు సెలబ్రిటీలు షేర్లు చేస్తున్నారు. మళ్ళీ పూరీ తన పూర్వ వైభవాన్ని చూపించాలని కోరుకుంటున్నారు.
director #PuriJagannadh writes open Letter and his philosophy towards the life.
@PuriConnects pic.twitter.com/H9QMJup2dT— Maduri Mattaiah (@madurimadhu1) October 30, 2022