డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు. అది కూడా ఛార్మీతో. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ లో హీరోలదే హవా. సినిమా కోసం చాలామంది కష్టపడినప్పటికీ ఎక్కువ పేరు మాత్రం దాదాపు వాళ్లకే వస్తూ ఉంటుంది. కొందరు డైరెక్టర్స్ ఈ విషయంలో కాస్త మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే ఓ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్.. ఇలా చెప్పుకుంటే పోతే కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్లందరూ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఒక్క పూరీ జగన్నాథ్ తప్ప. ఈ దర్శకుడిని చూస్తున్న చాలామంది ఫ్యాన్స్ కు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్ సినిమాలే కాదు ఆయన పెన్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందరు డైరెక్టర్స్ ఆచితూచి సినిమాలు తీస్తే.. పూరీ మాత్రం స్టార్ హీరోలతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదంతా ఒకప్పుడు.. ‘బిజినెస్ మేన్’ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ తప్పితే ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. విజయ్ దేవరకొండతో ‘లైగర్’ తీసిన పూరీ.. గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశాడు. పాన్ ఇండియాలో హిట్ కొట్టి వీర లెవల్లో కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరీ అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఘోరంగా ఫెయిలైంది. పూరీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయిపోయింది.
అయితే ‘లైగర్’ ఫ్లాప్ తో చాలా డిస్ట్రబ్ అయిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత నుంచి అంటే దాదాపు 6-7 నెలల నుంచి పెద్దగా బయట ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఛార్మితో కలిసి కెమెరాలకు పోజులిచ్చాడు. గత కొన్నాళ్ల నుంచి కలిసి సినిమాలు నిర్మిస్తున్న పూరీ-ఛార్మీ.. ముంబయి- హైదరాబాద్, హైదరాబాద్-ముంబయికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా కొత్త సినిమా కోసమే వెళ్లారేమో అనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ తీయాల్సిన ‘జనగణమన’ అర్థాంతరంగా ఆపేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏం అనౌన్స్ చేయలేదు. ఇలాంటి టైంలో పూరీ నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్ కు కాస్త రిలాక్సేషన్ ని ఇచ్చింది. మరి చాలారోజుల తర్వాత పూరీ జగన్నాథ్ బయట కనిపించడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.