కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఇరగదీసాడు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పునీత్ కి శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా మార్చ్ 17న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.